Site icon NTV Telugu

Mallu Ravi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు..

Mallu Ravi

Mallu Ravi

ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని బాంబ్ పేల్చారు. ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. కెసిఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు.

Also Read:Sundar Pichai: ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్.. అద్దె ఇల్లు వెతకడం ఇక ఈజీ..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా? ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు అని అన్నారు. బిహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. నోటీసులు అందకపోవడం మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? విద్యుత్ కమిషన్ విషయంలో కెసిఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని మల్లు రవి సూచించారు.

Exit mobile version