Site icon NTV Telugu

Magunta Srinivasulu Reddy: వైసీపీ సీటు ఇవ్వకుంటే ఏం చేద్దాం..? అనుచరులతో మాగుంట మంతనాలు..

Magunta

Magunta

Magunta Srinivasulu Reddy: ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయం వద్ద అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది.. ఇటీవలి వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాగుంటను పరామర్శించేందుకు పలు నియోజకవర్గాల నుంచి తరలివస్తున్నారు పలువురు కార్యకర్తలు, అభిమానులు.. ఇక, విడివిడిగా ముఖ్య అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు మాగుంట.. మరోవైపు.. మాగుంట కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. కాసేపు కరణం బలరాంతో ఆంతరంగికంగా మాగుంట చర్చలు కొనసాగాయి.. కానీ, మాగుంట, కరణం భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు ఆయన ముఖ్య అనుచరులు..

Read Also: YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

అయితే, ఇటీవలే మాగుంటకు సీటు లేదని స్పష్టం చేసింది వైసీపీ అధిష్టానం.. కానీ, మాగుంట సీటు కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టారు.. అధిష్టానంతో చర్చలు జరిపారు.. ఐప్యాక్‌ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.. అయినా.. ఇప్పటి వరకు మాగుంట సీటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు.. దీంతో.. వైసీపీలో సీటు ఇవ్వకుంటే ఏం చేయాలనే అంశంపై అనుచరులతో మాగుంట మంతనాలు జరుపుతున్నారట.. అనుచరులతో సమావేశాల అనంతరం.. ఎంపీ మాగుంట.. తన కుటుంబ సభ్యులతో కూర్చుని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. వైసీపీ లేకుంటే పార్టీ మారే అవకాశం ఉందని.. టీడీపీ నేతలతో మాగుంట టచ్ లోనే ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

Exit mobile version