AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సంస్థగా అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు ఎంపీ లింగమనేని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని దాదాపు ఐదు కోట్ల జనాభాకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఎయిమ్స్ సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ లింగమనేని లేఖలో వివరించారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు ఒకటికి మించి ఎయిమ్స్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కూ మరో రెండు ఎయిమ్స్‌లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలు తగ్గడంతో పాటు అధునాతన వైద్య సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
అలాగే ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌ను అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయాలని లింగమనేని రమేశ్ సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్, న్యూరోసైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను విస్తరించాలని కోరారు. ఈ విభాగాలకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలతో పాటు మరిన్ని పడకలు, వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలంటే ఎయిమ్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఎంపీ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి.. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ఎయిమ్స్‌లను మంజూరు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!