NTV Telugu Site icon

DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు

Bjp Mp Laxman

Bjp Mp Laxman

DR.Laxman: తెలంగాణలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో యుక్త వయసులోనే మహిళలు వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన..పటాన్ చెరు (మం) చిన్నకంజర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓట్ల కోసం కొందరు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. హిందువులను ఎవరైనా కించపరిస్తే ప్రతి ఒక్కరు శివాజీ కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిన నిజాంను ఓట్ల కోసం కొందరు పొగుడుతున్నారని తెలిపారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: KL Rahul Marriage: నటి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసిన కేఎల్ రాహుల్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఐదు లక్షల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి..తన కుటుంబానికి మాత్రం రాజకీయ పదవులు పంచి పెడుతున్నారంటూ మండి పడ్డారు. సబ్బండ కులాలు రోడ్డు మీద పడ్డారు. ఉపాధి లభించడం లేదన్నారు లక్ష్మణ్. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని… ఖాళీ స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి…నేడు ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణంలో వివిధ పార్టీల నుండి బీజేపీ లో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది యువకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా దేశం మొత్తం మోడీ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీజేపీలో చేరుతున్నారు.. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. .తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి