BJP MP Laxman: బీజేపీ మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ, అమిత్ షా, నడ్డా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.. మోదీపై ప్రజలకు అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించింది.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇటు కేసీఆర్ అబద్ధపు మాటలు, వాగ్ధానాలు విని విని ప్రజలు విసిగి వేసారి పోయారని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మనోగతాన్ని ప్రభావితం చేసే సంకల్ప పత్రం.. ఇతర పార్టీలు వేలం పాట మాదిరిగా పోటీ పడి పథకాలను ప్రకటిస్తున్నారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించిన ఆమోదయోగ్యమైన హామీలనే బీజేపీ ఇచ్చిందన్నారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణ అథో: గతి పాలు కావద్దని ప్రజలకు లక్ష్మణ్ సూచించారు.
Read Also:Revanth Reddy: కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా…
కర్ణాటక ప్రజల సొమ్ముతో తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు ఇస్తున్నారు. కర్ణాటక ఇవాళ కాంగ్రెస్ కు ఏటీఏంగా మారిందని విమర్శించారు. బీజేపీ కు ఓటు వేయాలని బీసీలు, ఎస్సీలు, మహిళలు నిర్ణయించుకున్నారు. టాటా కాంగ్రెస్.. బై బై BRS.. వెల్కమ్ బీజేపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. కారు షెడ్డుకు పోతుంది.. కమలం వికసిస్తుంది. ఇక చరిత్రలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన దాఖలాలు లేవు. ఇప్పుడు అరువై సీట్లు వస్తాయని ఎట్లా ఊహించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కు 60 సీట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడు రోజుల పర్యటన పార్టీ విజయానికి ఎంతో దోహదం చేస్తుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాల మీదనే ఆధారపడ్డాయి తప్పితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ముస్లిం పార్క్ ఏర్పాటు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి హామీలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పార్టీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Read Also:Actor Kasthuri: తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న గృహలక్ష్మీ కస్తూరి..?