టాలివుడ్ ప్రేక్షకులకు టాలివుడ్ నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.. గృహలక్ష్మీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఏదొక వార్తపై స్పందిస్తూ నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతుంది.. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కస్తూరి తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చింది.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది నటి కస్తూరి. మరి ఇంతకీ ఏ పార్టీ నుండి కస్తూరి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. నిజంగానే రాజకీయాల్లోకి రాబోతుందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది.. మరి ఆమె ఎందుకు అన్నదో అని చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు..
అంతేకాదు రాజకీయాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వనుందో కూడా చెప్పుకొచ్చింది.. చాలామంది ఆడవాళ్లు నేను ఎక్కడ కనిపించినా కూడా నా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడమే కాదు వారికి సంబంధించిన సమస్యలు కూడా నాతో పంచుకుంటున్నారు. మిగతా భాషల్లో నేను గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అన్ని సాంప్రదాయమైన పాత్రల్లోనే నటించాను.. ఈ సీరియల్ నాకు భాగా పేరును తీసుకొచ్చింది.. వారంతా నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నేను కళ్లారా చూస్తున్నాను. అందుకే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను అంటూ కస్తూరి శంకర్ తన మనసులో ఉన్న మాటని బయటపెట్టింది.దీంతో కస్తూరి శంకర్ నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెడుతుందని అందరూ భావిస్తున్నారు.మరి ఎప్పుడు, ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి..