Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : పదవుల కోసం వెంట పడేవాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Telangana Congress MP Komatireddy Venkat Reddy Fired on Revanth Reddy.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఎదురు దెబ్బ తగిలిన కాంగ్రెస్‌కు.. తాజాగా దాసోజు శ్రవణ్‌ కూడా రాజీనామా చేయడం బిగ్‌ షాక్‌ తగిలినట్లైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి కాంగ్రెస్ ​ సీనియర్​ నాయకులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై కోమటిరెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయమై రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు. అంతేకాకుండా.. అమిత్ షాను కలిశానని, తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల.. రూ.14వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. 377 కింద లోక్ సభలో వరద నష్టంపై ప్రస్తావించానని, ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మీటింగ్ లతో బిజీగా ఉన్నానన్నారు.

Breaking News : కాంగ్రెస్‌ కు మరో బిగ్‌ షాక్‌.. పార్టీకి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ రాజీనామా

 

తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కోరానని, పదవుల కోసం వెంటపడేవాడిని కాదని, నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు వెంకట్‌ రెడ్డి. నేను పార్టీ మారేది ఉంటే.. చెప్పి వెళతాను..కేంద్రం నుంచి చాలా నిధులు తీసుకువచ్చానన్నారు. నేను ఎవరికీ భయపడను… ప్రజాసమస్యల కోసం పోరాడే వ్యక్తిని.. నన్ను ఓడించడానికి ప్రయత్నించిన చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరాక ..నేను చండూరు సభకు వెళ్ళాలా? నాకు తెలియకుండా సభ పెడతారు.. నేను రూపాయి ఖర్చుపెట్టకుండా ఎంపీగా జనం గెలిపించారు… పార్టీ మారుతున్నానని ప్రచారం చేశారు అంటూ వెంకట్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

 

 

Exit mobile version