Kesineni Nani: తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయనను మూడు నెలలు హోటల్‌లో పెట్టానని.. అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని ఆయన చెప్పారు. అదే హోటల్ ఉండి అరాచకాలు చేస్తుంటే హోటల్ కాళీ చేపించండి అంటూ హోటల్ వాళ్ళు బ్రతిమిలాడే పరిస్థితికి వచ్చారన్నారు. హోటల్ కాళీ చేపించడానికి తాను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. అమరావతి ఉద్యమం పేరిట రైతుల దగ్గర సైతం చందాలు వసూలు చేసేవాడన్నారు. టీవీల్లో మాట్లాడుతున్న ఒకతనిపై లైవ్ లోనే చెప్పుతో కొట్టాడన్నారు.
Read Also: CM Jagan Vizag Tour: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
చంద్రబాబుకు తిరువూరు అంటే చాలా కోపమని కేశినేని నాని అన్నారు. ఇక్కడ టీడీపీలో అలి బాబా 40 చోర్‌లు ఉన్నారని, ఎందుకంటే వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాలి కాబట్టి అంటూ ఆయన పేర్కొన్నారు. అలీబాబా 40 దొంగలను మించిన దొంగలకే దొంగని తిరువూరుకు పంపించారు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, మమ్మల్నీ డబ్బులు అడుగుతున్నాడేంటీ అని నన్ను అడుగుతున్నారన్నారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి ఒక కాలకేయుడు, కీచకుడు కూడా అంటూ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. స్వామిదాస్ మీద కామెంట్ చేశాడట ఆ కాలకేయుడు, కీచకుడు.. ఎవరైనా ఒక్కరు స్వామిదాస్ ఇబ్బంది పెట్టారని చెబితే తాను, స్వామిదాస్ ఇద్దరం పోటీ నుంచి విరమిస్తామని ఎంపీ కేశినేని ఛాలెంజ్ చేశారు. అమెరికా నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు ఆ డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోతాడని ఆయన ఆరోపించారు.