NTV Telugu Site icon

MP Kesineni Nani: ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తా.. మూడోసారి ఎంపీని నేనే..

Kesineni Nani

Kesineni Nani

MP Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని కేశినేని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచానని, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి మూడోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న పార్టీ సమావేశానికి రావొద్దని తనకు సమాచారం అందించారని, చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్నొన్నారు. ఏడాదిగా కేశినేని నాని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తరుచూ పార్టీపై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీలో ఆయన కేంద్ర బింధువుగా మారారు. పార్టీ మారుతాడని ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండిస్తున్న నాని కొద్ది రోజుల్లో తన అనుచరులు, నాయకులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: Kapu Ramachandra Reddy: ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా.. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్‌బై!

కేశినేని నాని మాట్లాడుతూ.. “నా అభిమానులకు క్లారిటీ ఉంది.. అధినేత చెప్పింది రామభక్త హనుమాన్‌లాగా పాటిస్తాను. నాకు నా అభిమానులకు టెలీపతీ ఉంది. తినబోతూ రుచులు ఎందుకు. ఒకళ్ళు ఓడాలి… ఒకరు గెలవాలి… తప్పేం లేదుగా. నన్ను నమ్ముకుని వేల మంది ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు.. నేను బొమ్మసాని సభకు వెళ్ళడం లేదు. పార్టీ కార్యక్రమాలకు వద్దనే అధికారం అధినేతకు ఉంది… కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనవద్దని అనలేరు. పార్టీ అన్నాక అధినేతకు కొన్ని తప్పనిసరి పతిస్ధితులుంటాయి. చంద్రబాబును కూడా తప్పు అనడానికి లేదు. ఇద్దరు మాజీమంత్రులు, ఒక మాజీ ఎంపీ అబద్ధం చెపుతారా?. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాను. మూడోసారి నేను విజయవాడ పార్లమెంటు నుంచి ఎన్నిక అవుతాను. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక వ్యక్తి ప్రెస్ మీట్‌లో చెప్పుతో కొడతా అన్నారు. 30కి పైగా కార్పొరేటర్లు గెలవాల్సి ఉండగా… కావాలని ఓడించారు. రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రధాని, హోంమంత్రిలను కలిసారు ఏమైనా తప్పుందా. నేను వైసీపీ నేతలతో ప్రోగ్రామ్‌లలో పాల్గొనటానికి ప్రజాప్రతినిధిగా మంచి సాంప్రదాయం ప్రకారం కలిసి ఉండొచ్చు. అది ఎలా తప్పు అవుతుంది.” అని కేశినేని నాని పేర్కొన్నారు.