Site icon NTV Telugu

MP Gaurav Gogoi: మణిపూర్‌ అల్లర్లపై ప్రధాని మోడీ మౌనవ్రతం వీడాలి

Gogoai

Gogoai

నేడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ప్రారంభించారు. చర్చ ప్రారంభంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్‌ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదుని బీజేపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు నిలదీశారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని గౌరవ్‌ గొగొయ్‌ పేర్కొన్నారు. దేశంలో హింస ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యానికి విఘాతమేనని ఆయన అన్నారు. మణిపూర్‌ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారని గౌరవ్ గొగొయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Smart Watch Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 89 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 12 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 1299లకే!

ప్రధాని నరేంద్ర మోడీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ మణిపూర్‌ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది.. మణిపూర్‌కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్‌ వెళ్లారు, మోడీ ఎందుకు వెళ్లలేదు? మణిపూర్‌ తగలబడుతుంటే.. భారత్‌ తగలబడుతున్నట్లేనని ఆయన తెలిపారు.

Read Also: PM Modi: ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి..!

ప్రధాని నరేంద్ర మోడీ ముందు మణిపూర్‌ వెళ్లి చూడండి.. అప్పుడు మాట్లాడండి. మణిపూర్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు విఫలమైంది అని ఎంపీ గొగొయ్ విమర్శించారు. మణిపూర్‌ లో మహిళపై దాడులు, అక్కడి పౌరులపై దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మణిపూర్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసింది అని గొగొయ్ అన్నారు. మణిపూర్‌ మంత్రి సోదరుడు డ్రగ్‌ మాఫియా నడుపుతున్నారు.. డ్రగ్‌ మాఫియా నిందితుడిని సీఎం ఫోన్‌కాల్‌తో విడుదల చేశారు అని గౌరవ్ గొగొయ్ అన్నారు.

Read Also: Online Transaction: గుడ్ న్యూస్.. డెబిట్-క్రెడిట్ కార్డ్‌ల వాడకానికి ఇకనుంచి సీవీవీ తప్పనిసరి కాదు

ఇంటెలిజెన్స్‌ వైఫల్యం వల్లే మణిపుర్‌ హింసకు కారణమని గొగొయ్ ఆరోపించారు. మణిపుర్‌పై 30 సెకన్ల పాటు మాట్లాడేందకు మోడీకి 80 రోజులు ఎందుకు పట్టింది? అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరిగినా మణిపూర్‌ సీఎంను ఎందుకు పదవి నుంచి తొలగించలేదు అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అడిగారు. మణిపూర్‌ వీడియోలు బయటకు రాకుంటే మోడీ పెదవి విప్పేవారే కాదని అన్నారు. మణిపూర్‌లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మణిపూర్‌ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని గౌరవ్ గొగొయ్ గుర్తు చేశారు.

Exit mobile version