Site icon NTV Telugu

Jabalpur: డ్రైవర్‎కు హార్ట్ ఎటాక్.. సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

Mp Bus Driver

Mp Bus Driver

Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఓ కూడలి వద్ద అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ ఆగింది. ఇంతలోనే అకస్మాత్తుగా ఓ బస్సు వారి పైకి దూసుకొచ్చింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అంతా నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్‌దేవ్‌ పటేల్‌ అనే వ్యక్తి జబల్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రోజూలానే శుక్రవారం తన విధులకు హాజరయ్యారు. బస్సు నడుపుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. ఇదంతా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కెమెరాలో రికార్డైంది.

Read Also: Bharat Jodo Yatra:భారత్‌ జోడో యాత్రలో కంప్యూటర్‌ బాబా.. పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!

బస్సు ఇతర వాహనాలను ఢీకొట్టడాన్ని అందులో చూడవచ్చు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సిటీ బస్సు గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం గుండా వెళుతుండగా, అది అకస్మాత్తుగా దాని మార్గం నుండి తప్పించుకుని, సమీపంలోని వాహనాలను ఢీకొన్నది. ఆటో, కొన్ని బైకులను కొద్ది దూరం లాక్కెళ్లి ఆగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని, సీటులో కూర్చున్న డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు రాణిటాల్‌కు వెళ్తోంది. అయితే లోఫ్లోర్‌ బస్సు కావడంతో దాని కింద ఎవరూ పడలేదని పోలీసులు తెలిపారు.

Exit mobile version