డా.కె.లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ నేతగా కీలకమయిన పదవులు చేపట్టారు. ఓబీసీ ఛైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా కీలక పదవులు చేపట్టారు. తాజా రాజకీయ పరిణామాలపై ఎన్టీవీ FACE TO FACEలో అనేక అంశాలు వెల్లడించారు. బీజేపీలో కష్టపడితే పదవులు అవే వస్తాయి. బాధ్యత గా బరువు మాకు పెంచుతుంది. నాకు పదవులు వచ్చాయనే కంటే బాధ్యతలు పెరిగాయంటే బాగుంటుందన్నారు డా.కె.లక్ష్మణ్. బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. ఓబీసీ మోర్చాను అభివృద్ధి చేస్తా. నేను పార్టీలో చేరినప్పటినుంచి నాకు ఇచ్చిన పదవులు ఎన్నో. నాపై మోపిన బాధ్యతల్ని అత్యంత సమర్థంగా, నిజాయితీతో పనిచేస్తున్నానని గుర్తించింది..
ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఎన్నికల సమయంలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రిని చేయాలని ఇలా పదవులు ఇచ్చిందని నేను భావించడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలే మాకు మళ్లీ అధికారం తెచ్చిపెడుతుంది. సామాజిక న్యాయం అనే భావనతో అనేకమందికి పదవులు ఇచ్చాం. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేశాం. ప్రాంతీయ పార్టీల్లో సామాజిక న్యాయం లేదు. కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి అందరికీ న్యాయం చేశామని భావిస్తారు.
8 ఏళ్ళపాటు బీజేపీ అధికారంలో వున్నాం. 1998 నుంచి విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ని జరపాలని బీజేపీ భావిస్తోంది. కేవలం హిందూ, ముస్లిం అనే భావన లేదు. ప్రపంచ చరిత్రలో దీనిని బయటకు తేవాలి. భావితరాలకు పోరాట యోథుల్ని స్ఫూర్తిని అందించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వాముల్ని చేయాలని మేం భావిస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిపి ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నాం అన్నారు డా.కె.లక్ష్మణ్. రాజాసింగ్ వివాదంపై ఆయన స్పందించారు. గతంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై అంతగా స్పందించలేదు. అసలు రాజాసింగ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఓవైసీ కి లేదన్నారు లక్ష్మణ్.
Read Also: USA: విమానాన్ని దొంగిలించిన పైలెట్.. వాల్‌మార్ట్ పై కూలుస్తానని హెచ్చరిక
కాంగ్రెస్ అనేక అంశాలపై రాజీ పడుతోంది. గతంలో వున్న చరిత్ర వుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి వున్నాయి. గతంలో కలిసి ప్రభుత్వంలో వున్నాయి. ప్రజలు కూడా మునుగోడులో బీజేపీని గెలిపిస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికి నాంది కాబోతోంది. ఈడీని పురిగొల్పి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్పించామనేది చవకబారు విమర్శలు అన్నారు. తప్పులు చేయడం వల్ల ఈడీ అంటే భయపడిపోతున్నారు. మీరు నిజాయితీగా వుంటే ఈడీకి భయపడడం ఎందుకు? ఈసారి ఎన్నికల్లో పోటీకి చాలామంది ముందుకు వస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సమాజంలో భాగస్వాములు. వారి గ్లామర్ బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నాం.. బీజేపీ విధానాల పట్ల సినీ ప్రముఖులు ఆకర్షితులవుతున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలరని భావిస్తున్నాం. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనుక ఏం జరిగిందనేది భవిష్యత్ చెబుతుంది. ఏపీలో బీజేపీ టీడీపీ కలిసి వస్తుందనేది మేం చెప్పలేం. జనసేనతో కలిసి ఎదగాలని అనేకమంది పార్టీలో చేరుతున్నారు. ఏపీలో చాపకింద నీరులా మేం ఎదుగుతాం అన్నారు డా.లక్ష్మణ్.
ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా బీజేపీని ఏం చేయలేరు. రాజ్యాంగాన్నిమార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. స్వంత రాజ్యాంగాలను ఆచరించే వారిని ప్రజలు తిరస్కరిస్తారు. మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర పథకాలు, మోడీ ఫోటో గురించి చర్చించడం తప్పేం లేదు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రం. కేంద్రం నుంచి ఎంత వాటా వస్తుంందని కలెక్టర్ చెప్పలేకపోయారు. నిధులు మోడీవీ.. ప్రచారం మీదా? సొమ్మొక్కడిది.. సోకు ఒకడిది. ప్రధానిని గౌరవించే సంస్కారం లేదా అన్నారు ఎంపీ డా.లక్ష్మణ్. అధికారుల్ని కించపరచడం అనేది కేటీఆర్ చెప్పాల్పింది లేదు. గతంలో పోలీసు అధికారులను టీఆర్ఎస్ నేతలు దూషించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. మమ్మల్ని ప్రశ్సిస్తే దాడులు చేస్తారా? ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఎప్పుడు చేరింది? కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ సమయంలో మీరేం చేశారని కేసీఆర్ ని ప్రశ్నించారు డా.లక్ష్మణ్.
Read Also: Amit Shah: కాంగ్రెస్ దేశం నుంచి తుడిచిపెట్టుకుపోతోంది.. బీజేపీదే భవిష్యత్తు