NTV Telugu Site icon

MP Arvind: పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు నా రాజకీయ పునాది

Arvind

Arvind

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు రైతుల కృతజ్ఞత సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయని.. తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని చెప్పారు. నాలుగు పైసల అవినీతి కూడా తన మీద లేదని, ఉండదన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మూడు సార్లు గెలిచిన అవినీతి పరుడని.. ఎస్సైని ట్రాన్స్ఫర్ చేయిస్తే పది లక్షలు, సీఐని ట్రాన్స్ఫర్ చేయిస్తే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడని విమర్శించారు. దళారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ సచ్చిపోయిన పీనుగ అని.. తన తండ్రైన, జీవన్ రెడ్డి అయినా ఒక్కటేనని తెలిపారు.

Intelligence Bureau Recruitment : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. 677 పోస్టుల భర్తీ..

పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు. శారీరకంగా కాదు, రాజకీయంగా కూడా కవిత తనను అందుకోలేదని… కవిత లిక్కర్ బోర్డు తెచ్చిందని అర్వింద్ విమర్శించారు. ఇందూర్ పార్లమెంట్ లో 7 సీట్లు గెలిపించండి.. ఇందూర్ పార్లమెంట్ లో బీజేపీ హుందాతనం రావాలని కోరారు.

Tamannah : ఆ కాస్మోటిక్ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదని విమర్శించారు. మన కొడుకుకో, బిడ్డకో శాపం పెట్టినట్లేనని తెలిపారు. హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. నవంబర్ 30న తెలంగాణకు బీఆర్ఎస్ పీడ పోతుందని ఆరోపించారు. ఇందూరు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపి గెలిస్తే.. షుగర్ ఫ్యాక్టరీతో చెరుకు పంటకు పునర్ వైభవం తీసుకొస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.