Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mp Daggubati Purandeswari Says Bjp Is The Party That Respects Ambedkar The Most

Daggubati Purandeswari: అంబేద్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి

Published Date :December 24, 2024 , 11:15 am
By Sampath Kumar
  • అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు
  • ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్‌
  • అంబేద్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ
Daggubati Purandeswari: అంబేద్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

డా.బీఆర్ అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్‌ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్‌.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పురందేశ్వరి స్పందించారు.

రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… ‘బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను అమితంగా గౌరవించిన పార్టీ బీజేపీ. ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగంను ఎత్తివేస్తుందని కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేసింది. పార్లమెంట్లో అమెండిమెంట్ (సవరణలు) ద్వారా రాజ్యాంగం మార్చడం వీలవుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నకాలంలో ఎప్పుడు రాజ్యాంగం స్వలాభం కోసం మార్చలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమెండిమెంట్స్ చేసాము. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపరంగా రాజ్యాంగాన్ని మార్చింది. అంబేడ్కర్‌కు భారత్ రత్న ఇవ్వాలని కాంగ్రెస్‌కి తట్టలేదు. బీజేపీ ప్రభుత్వంలోనే అంబేడ్కర్‌కు భారత్ రత్న ప్రకటించాము. అంబేడ్కర్‌ను రెండుసార్లు కాంగ్రెస్ అమానించింది. గతంలో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవనివ్వలేదు. కాంగ్రెస్ చర్యలతో అంబేద్కర్ మానసికంగా కుంగిపోయారు’ అని అన్నారు.

‘హిందూ బిల్, యూనిఫాం సివిల్ కోర్టు బిల్ ప్రవేశపెట్టాం. రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి మాల వెయ్యలేదు. ప్రజా సమస్యలు చర్చించే దేవాలయంలో కాంగ్రెస్ అడ్డుకుంటుంది. బీజేపీ ఎన్నడూ రాజ్యాంగాన్ని ఉల్లంగించలేదు, మార్చాలన్న భావన లేదు. గతంలో ఆర్టికల్ 356ని రద్దును తీవ్రంగా వ్యతిరేకించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వం రద్దు చేసే చట్టం ఆర్టికల్ 356. జమీలి ఎన్నికల బిల్లు లోక్ సభలో చర్చించడం జరిగింది. జేపీసీ వెయ్యడం జరిగింది. విధివిధానాలు రూపొందించి బిల్లు ప్రవేశ బెట్టడం జరుగుతుంది’ అని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • ap
  • bjp
  • congress
  • Daggubati Purandeswari

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions