Site icon NTV Telugu

Bandi Sanjay: శ్రీరామ నవమి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉంది..

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ లోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో పద్మభూషణ్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీతారామచంద్ర స్వామి చిత్రపటం, ఫలం అందించి ఆశీస్సులు అందించారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో శ్రీరామ నవమి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శతాబ్దాల చిరకాల కల అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన వేళ ఇంటింటా అయోధ్య అక్షింతలు అందుకున్న శుభ తరుణాన శ్రీరామ నవమి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.

Read Also: Ranam Movie OTT : ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సందర్భంగా కరీంనగర్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ధర్మ రక్షణ కోసం చేస్తున్న మహ క్రతువులో నేనూ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో మరోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాముడి అండదండలు మోడీకి బలంగా ఉన్నాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version