Arvind Dharmapuri : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆవేశంలో ఊగిపోయారు. ప్రశాంత్ రెడ్డి నంగనాచి మాటలు బందు పెట్టాలని సూచించారు. 2020 – 21 లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డి నప్పతట్లోడు అంటే ఓ చేతగాని దద్దమ్మ అని వ్యాఖ్యానించారు. పసుపు రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఏ విధంగా ఆదుకుంటారో కెసిఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల విషయంలో ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మీ బాపు దగ్గరికి పోయి పసుపు రైతులకు ఎంత ఇప్పిస్తావో చెప్పాలన్నారు. ఇక కెసిఆర్ మేనిఫెస్టో చూస్తే చక్కెర వచ్చి కింద పడతారని ఎద్దేవా చేశారు.
Read Also: Pawan Kalyan varahi : రేపు కొండగట్టుకు వారాహి.. పూజల అనంతరం రోడ్డెక్కనున్న వాహనం
కేటీఆర్ దావోస్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెళ్తారని.. ఆయన ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకి ఎంత తీసుకువచ్చారు? ఏ ఇండస్ట్రీ తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెజాన్, డెలాయిట్లులు ఇండస్ట్రీలు కావన్నారు ఎంపీ అరవింద్. ఐదు లక్షల జీతం ఇచ్చి ఆయన ఫార్మ్ హౌస్ లో రీసెర్చ్ చేసేందుకు పెట్టుకున్నారని ఆరోపించారు. పసుపు రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఏ విధంగా ఆదుకుంటారో కెసిఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల విషయంలో ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మీ బాపు దగ్గరికి పోయి పసుపు రైతులకు ఎంత ఇప్పిస్తావో చెప్పాలన్నారు.
Read Also: Noro Virus : ఎర్నాకులంలో నోరో వైరస్ నిర్ధారణ.. 19 మంది విద్యార్థులకు అనారోగ్యం