Site icon NTV Telugu

MP Arvind: తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్‌ను పెంచి పోషిస్తున్నారు

Mp Arvind

Mp Arvind

రాష్ట్రంలో క్రైమ్ రేట్ ను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌. తాజాగా ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ అనేది కేసీఅర్ మాయ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020-21లో 10వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టి రూపాయి ఖర్చు చేయలేదన్నారు. నిధులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. 2021-2022లో 10,875కోట్లు కేటయించామని చెప్పి 4800 కోట్లకు కుదించి రూపాయి ఖర్చు చేయలేదన్నారు. ఆడిటింగ్ లోనూ చెప్పలేదని, దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నాలుగు ఎమ్మేల్యేగా గెలిచిన వ్యక్తి కళ్యాణ లక్ష్మి చెక్కులు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వరని ఎలా అంటాడు? అని ఆయన మండపడ్డారు. 15నెలల కాలంలో నా ఫౌండేషన్ నుంచి 29లక్షలు బూత్ లెవల్ కార్యకర్తలకు ఇచ్చానని ఆయన వెల్లడించారు.

Also Read : Sushmita Konidela: నాన్నతో సినిమా తీసేందుకు కథల వేటలో ఉన్నా!

ఫసల్ బీమా పెట్టి ఉంటే రైతులకు ఈ సమయంలో మేలు జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి సీఎంఅర్ఎఫ్ ఇప్పించాల్సిన.. ఖర్మ ఏంటి మంత్రి?… అందుకేనా ప్రజలు ఓట్లేసింది? అంటూ ప్రశ్నించారు అర్వింద్‌. జగిత్యాలలో 40 శాతం రెండు పడక గదుల ఇళ్లు ముస్లింలకు ఇచ్చారని, అసెంబ్లీ పరిధిలో 10 శాతం జనాభా లేని ముస్లింలకు 40 శాతం ఎలా ఇస్తారని ప్రశ్నించారు అర్వింద్‌. ఇక్కడ చేసేది ఏమీ లేనట్టు బీఆర్ఎస్ పేరుతో దేశంలో తిరుగుతారంట.. అంటూ ఎద్దేవా చేశారు అర్వింద్‌. మూడేళ్లుగా తెగుళ్ల బారిన పడి పసుపు నాణ్యత పడిపోయిందని ఆయన వెల్లడించారు.

Also Read : Shark Tank India’s Season-2: అలాంటివారి కోసం షార్క్‌ ట్యాంక్‌ రియాల్టీ షో

Exit mobile version