NTV Telugu Site icon

MP Arvind : తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్లు ముంచిండు

Dharmapuri Arvind

Dharmapuri Arvind

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద పోటీ చేసినందుకు కవిత భయపడుతుందని, నా మీద పోటీ చేసే దమ్ము లేక మరొక అభ్యర్థిని బరిలో ఉంచి కవిత నన్ను ఓడిస్తుందట అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ అవినీతిపరురాలు కవిత అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలు పాలయ్యిండని, ఆయనను చూసేందుకు ఇక కవితక్క పోతది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్‌లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ

జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానమన్న ఎంపీ అర్వింద్‌.. జీవన్ రెడ్డి అంకులు అంటే నాకు ఇష్టమే కానీ కాంగ్రెస్ పని అయిపోయింది అంకుల్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పేద మహిళలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తనన్న వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ తుగ్గలో తొక్కిండని ఆయన మండిపడ్డారు. 2020-21లో పదివేల కోట్లు… 21-22లో 10.80 వేల కోట్లు బడ్జెట్ ప్రకటించి ఇండ్ల నిర్మాణం మాత్రం చేపట్టలేదని, తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ముంచిండంటూ అర్వింద్‌ తీవ్రంగా ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ లో అవినీతి సొమ్ము, కాళేశ్వరం అవినీతి సొమ్ముతో మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేస్తున్న అవినీతిపరుడు కేసీఆర్ అని, కవిత 100 కోట్లు లిక్కర్ స్కాంలో కీలకమన్నారు. కారు.. చెయ్యి వద్దు బీజేపీ కమలం పువ్వు ను గెలిపించాలని ఆయన కోరారు.

Also Read : Colors Swathi: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకొని తప్పించుకున్న హీరోయిన్..?