కేంద్ర ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేసి.. ఈడీ కేసులు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. మెదక్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కుమార్తె తెలంగాణలో దోచుకుంది సరిపోక.. ఢిల్లీలోనూ దోచుకోవాలన్న దురాశతో లిక్కర్ స్కాంలో వేలు పెట్టిందని విమర్శించారు ఎంపీ అర్వింద్. స్కాం విచారణలో భాగంగానే కవిత పేరును చేర్చారని ఎంపీ అర్వింద్ చెప్పారు. కేసీఆర్ ముందస్తుకెళ్తే సంతోషపడేది బీజేపీ పార్టీయేనన్నారు. ముందస్తుకు పోయేంత ధైర్యం కేసీఆర్ చేయడని ఎంపీ అర్వింద్ అన్నారు. స్కాం విచారణలో భాగంగానే కవితను చేర్చారు తప్పా ప్రత్యేకంగా ఎవరి పై టార్గెట్ చేసింది లేదన్నారు.
Also Read : SCCL : త్వరలో మరో 3 ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి
జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్షంలో కేసీఆర్ విహరించిన మాకేం అభ్యంతరం లేదని ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. బీజేపీ అభ్యర్థులు పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుని ప్రజలతో ఉంటే గెలుపు కోసం బెంగ పడాల్సిన అవసరమే లేదని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. తమ లక్ష్యం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమేనని, హిందుత్వ, జాతీయ వాదంతో గతంలో 44 శాతం ఓటు బ్యాంకు సాధించామన్నారు. ప్రస్తుతం అది 50 శాతం చేరిందని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫకీర్ గాళ్ళ కంటే అధ్వానంగా మారిపోయారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఉన్న విలువ ఇప్పుడు చూస్తే ఎంత అధ్వానంగా మారిందో చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని, ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు చెపుతున్న అది అంతట జరగడం లేదని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు.
Also Read : AP Voters List Announced: ఏపీలో ఓటర్ల జాబితా రెడీ.. ఎంతమందో తెలుసా?