MP Arvind : ఎన్నికల్లో హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యం
కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యమని ఆయన ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తిన్నారు, కాబట్టే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. మీరు డీపీఆర్ ఇస్తే, జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Maheshwar Reddy : ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది
మహిళా గవర్నర్ పై అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా టీఆర్ఎస్ సంస్కృతి అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగయింది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసి , ఆ తరువాత జీఎస్టీ గురించి మాట్లాడండని ఆయన హితవు పలికారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.
Also Read : Emirates Flight: 13 గంటలు గాల్లో ప్రయాణించిన విమానం.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే!
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?
-
YS Jagan Foreign Tour: వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
-
Mrunal Thakur : చుంకీ పాండేకు భార్యగా నటించడంపై మృణాల్ అసంతృప్తి
-
JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!
-
Trump: అసిమ్ మునీర్, షరీఫ్‌పై ప్రశంసలు.. పాకిస్థాన్ వెళ్తానన్న ట్రంప్
ట్రెండింగ్
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
-
Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!