Site icon NTV Telugu

MP Arvind : ఎన్నికల్లో హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యం

Mp Arvind

Mp Arvind

కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యమని ఆయన ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తిన్నారు, కాబట్టే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. మీరు డీపీఆర్‌ ఇస్తే, జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Maheshwar Reddy : ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది

మహిళా గవర్నర్ పై అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా టీఆర్ఎస్ సంస్కృతి అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగయింది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసి , ఆ తరువాత జీఎస్టీ గురించి మాట్లాడండని ఆయన హితవు పలికారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.

Also Read : Emirates Flight: 13 గంటలు గాల్లో ప్రయాణించిన విమానం.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే!

Exit mobile version