నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి, కవితలు వ్యాపార భాగస్వాములు.. ఇద్దరూ ఒకే కంపెనీ లో డైరెక్టర్‌లు అని ఆయన అన్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్ కు ఎమ్మెల్సీ కవిత ఇంఛార్జి గా ఉన్నారని, ఆకుల లలితను రేవంత్ కు చెప్పి కాంగ్రెస్ కు కవిత నే పంపిస్తున్నారన్నారు. బీజేపీ ఓట్లు చీల్చెందుకే ఆకుల లలితను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని, డీఎస్ ను మోసం చేసి దిగ్విజయ్ సింగ్ కు డబ్బులు ఇచ్చి ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : Australian Fan: లక్నో స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమాని హల్చల్.. గణపతి బప్పా మోరియా అంటూ స్లోగన్స్
అంతేకాకుండా.. రాజకీయంగా కుట్రపూరితంగా అప్పుడు డీఎస్, ఇప్పుడు ఆయన కుమారుడి సంజయ్ ను మోసం చేస్తున్న వ్యక్తి ఆకుల లలిత అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్ కు వేసినా ఒక్కటేనని అర్వింద్ అన్నారు. జగిత్యాల నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కాం గురించి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి అమరవీరుల ఉసురుకొట్టిందన్నారు. తెలంగాణ సొమ్మును కొల్లగొట్టిన కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మోదీపై ఎక్కువగా మాట్లాడితే కేటీఆర్‌ను ఫుట్ బాల్ ఆడుతానన్నారు.
Also Read : Etela Rajender : నాతో వస్తా అన్న వారిని హరీష్ రావు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు