Site icon NTV Telugu

Keerthy Suresh : వారంలో సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఎక్కడ కీర్తి?

Keerthi

Keerthi

భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్‌ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ.

Also Read : Aishwarya Rajesh : హిట్ కొట్టినా.. పర్ఫామెన్స్ బాగా చేసిన కూడా సినిమాలు రావట్లేదు.. కారణం ఏంటి?

రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియెంట్ చిత్రంలో నవంబర్ నెలలో హాయ్ చెప్పబోతుంది. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ తమిళ ఫిల్మ్ వాయిదా పడుతూ నవంబర్ 28కి జరిగింది. జేకే చంద్రు దర్వకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.  మరో పదిరోజుల్లో రిలీజ్ కాబోతున్న రివాల్వర్ రీటా ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికీ మొదలు పెట్టలేదు. బహుశా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందేమో. మహానటితో జాతీయ అవార్డును కొల్లగొట్టిన కీర్తి సురేశ్ ఆ తర్వాత పలు లేడీ ఓరియెంట్ చిత్రాలు మిస్ ఇండియా, గుడ్ లఖ్ సఖీ,రఘుతాత చిత్రాల్లో మెరిసింది కానీ అవి బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఈ థియేట్రికల్ మూవీస్సే కాదు పెంగ్విన్, ఉప్పుకప్పురంబు లాంటి హీరోయిన్ ఓరియెంట్ ఓటీటీ చిత్రాల్లో మెరిసినా అవేమీ కూడా ప్లస్ కాలేదు. కానీ ఈ సారి కూడా ఫీమేల్ ఓరియెంట్ ఫిల్మ్ రివాల్వర్ రీటాతో మరోసారి టెస్టుకు రెడీ అవుతోంది. ఈ సంగతి సరే ఎప్పుడో ఎనౌన్స్ చేసిన అక్కా వెబ్ సిరీస్ వచ్చేది ఎప్పుడో, ఇక తమిళంలో కన్నివీడి, మలయాళంలో తోట్టం చేస్తుంది మహానటి. మరి ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.

Exit mobile version