Site icon NTV Telugu

Manchu Vishnu: లడ్డూ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..

Manchu Vishnu Prabhudeva

Manchu Vishnu Prabhudeva

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది. ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య చిన్నపాటి ప్రచ్ఛన్నం యుద్ధం జరిగింది. ఇదిలా ఉండగా.. ఈ వివాదంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి స్పందించారు.

READ MORE: Breaking News: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి.. కానిస్టేబుల్ వీరమరణం

ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో విష్ణు మాట్లాడుతూ.. ” లడ్డూ అంశం చాలా సున్నితమైంది.. దీని గురించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు. నేను కూడా తిరుపతికి చెందిన వాడినే. ఇక్కడ ఎవరికీ కమ్యూనిటీ ఫీలింగ్‌ లేదు.” అని స్పష్టం చేశారు. కాగా.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన జానీ మాస్టర్ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని ఫిల్మ్ ఛాంబర్ చూసుకుంటుందన్నారు.

Exit mobile version