Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంటార్కిటికా అనగానే మనకు గుర్తొచ్చేది ఎటు చూసినా కనిపించే దట్టమైన మంచు. కానీ, ఆ మంచు ఖండంలో ఓ అగ్నిపర్వతం బంగారాన్ని గాల్లోకి విరజిమ్ముతోంది. అదే అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఉన్న ‘మౌంట్ ఎరెబస్’. ఇది భూమిపై ఉన్న అత్యంత దక్షిణ క్రియాశీల అగ్నిపర్వతం. దీని నుంచి వెలువడే వాయువుల్లో ప్రతిరోజూ అత్యంత విలువైన బంగారు ధూళి కణాలు వెలువడుతున్నట్లు నాసా, ఇతర పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ అగ్నిపర్వతం నిరంతరం మండుతూనే ఉంటుంది. ఇది తన లావా వాయువులతో కలిపి రోజుకు సగటున 80 గ్రాముల సూక్ష్మ బంగారు కణాలను వాతావరణంలోకి పంపుతోంది. ఇలా గాల్లోకి కలుస్తున్న బంగారు ధూళి విలువ రోజుకు సుమారు 6 వేల డాలర్లు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి సుమారు రూ. 18.9 కోట్ల విలువైన బంగారాన్ని ఇది వెదజల్లుతోంది. ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడే బంగారు రేణువులు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. గాలి ద్వారా సుమారు 1,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి అంటార్కిటిక్ మంచుపై పడుతున్నాయి. ఈ బంగారు కణాలు కేవలం 60 మైక్రోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. వీటిని సాధారణ కంటితో చూడలేము, మైక్రోస్కోప్‌తో మాత్రమే గుర్తించగలరు.
Also Read
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
ఇది ఎలా సాధ్యం?
మౌంట్ ఎరెబస్ లోపల ఎప్పుడూ మరిగిపోతున్న లావా సరస్సు ఉంటుంది. భూమి అడుగున ఉండే శిలాద్రవంలో సహజంగానే కొన్ని లోహాలు ఉంటాయి. లావా నుంచి వేడి వాయువులు పైకి ఎగజిమ్మినప్పుడు, ఆ వాయువులతో పాటు బంగారు కణాలు కూడా వాతావరణంలోకి కలుస్తాయి. అంటార్కిటికాలోని అతిశీతల వాతావరణానికి తగిలిన వెంటనే అవి సూక్ష్మ స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి.
ఇతర ప్రాంతాల్లోనూ బంగారం జాడలు..
కేవలం మౌంట్ ఎరెబస్ మాత్రమే కాదు, ప్రపంచంలోని మరికొన్ని అగ్నిపర్వతాలు కూడా స్వల్ప స్థాయిలో బంగారాన్ని వెలువరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. హవాయి, ఇటలీ, అలాస్కా, మెక్సికో దేశాల్లోని క్రియాశీల అగ్నిపర్వతాల లావాలోనూ బంగారం, రాగి, జింక్ వంటి లోహాల జాడలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఎరెబస్ అగ్నిపర్వతం వెలువరించే స్థాయిలో అవి బంగారాన్ని ఉత్పత్తి చేయలేవు. పర్యావరణ ప్రతికూలతల వల్ల ఈ బంగారాన్ని సేకరించడం అసాధ్యం అయినప్పటికీ, భూగర్భ వాతావరణాన్ని, అగ్నిపర్వతాల పనితీరును అధ్యయనం చేయడానికి ఇదొక అద్భుతమైన ప్రయోగశాలగా శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!