Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
- గేట్స్ ఫౌండేషన్‌కు షాకిచ్చిన వారెన్ బఫెట్
- నిలిచిపోయిన బిలియన్ డాలర్ల విరాళాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత పెద్ద దాతగా పేరుగాంచిన బర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఇరవై ఏళ్లలో మొదటిసారిగా ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’కు ఏటా ఇచ్చే బిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని నిలిపివేస్తూ కార్పొరేట్ రంగాన్ని ఆశ్చర్యపరిచారు. లైంగిక నేరస్థుడు, దివంగత జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న పాత సంబంధాలపై ప్రస్తుతం జరుగుతున్న విచారణ (External Investigation) నివేదిక కోసం 95 ఏళ్ల బఫెట్ వేచి చూస్తున్నారు. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఈ కారణంతోనే ఆయన ప్రతి సంవత్సరం మధ్యలో ఇచ్చే విరాళాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఏడాది చివర్లో తన ‘థాంక్స్ గివింగ్ లెటర్’ ద్వారా ఆయన ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉంది.
విరాళాలు ఎందుకు ఆగిపోయాయంటే..
దీనికి ప్రధాన కారణం జెఫ్రీ ఎప్స్టీన్ వివాదమే అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్కు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు, ఈ-మెయిల్స్‌ను బహిర్గతం చేసింది. గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులు గతంలో ఎప్స్టీన్తో సంప్రదింపులు జరిపినట్లు ఈ ఫైళ్ల ద్వారా వెల్లడైంది. ఈ వార్త మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్టకు పెద్ద దెబ్బలా మారిందని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్.. గతంలో ఎప్స్టీన్తో ఫౌండేషన్‌కు ఎంతవరకు సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించారు. ఈ వేసవిలోనే రానున్న ఆ విచారణ నివేదిక చూసిన తర్వాతే బఫెట్ తదుపరి విరాళాలపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఇద్దరు దిగ్గజాల స్నేహంలో బీటలు
ఈ వివాదం బఫెట్, బిల్ గేట్స్ వ్యక్తిగత సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య సంబంధాలు క్షీణించినట్లు తెలుస్తోంది. ఇటీవలి బర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశానికి (AGM) బిల్ గేట్స్ దూరంగా ఉండటమే దీనికి నిదర్శనం అని పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లలో గేట్స్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. అమెరికా ప్రభుత్వం ఎప్స్టీన్ పత్రాలను విడుదల చేసినప్పటి నుంచి బిల్ గేట్స్‌తో తాను మాట్లాడలేదని మార్చిలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బఫెట్ స్వయంగా అంగీకరించారు.
సేవా కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
వారెన్ బఫెట్ గేట్స్ ఫౌండేషన్‌కు అతిపెద్ద దాత. 2006 నుంచి 2025 వరకు ఆయన సుమారు 47 నుంచి 48 బిలియన్ డాలర్ల విలువైన బర్క్‌షైర్ హాత్వే షేర్లను ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. గత ఏడాది మాత్రమే ఆయన 4.5 బిలియన్ డాలర్లకు పైగా సాయం చేశారు. ఇంతటి భారీ నిధులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న విద్య, ఆరోగ్య, సామాజిక సేవా కార్యక్రమాల వేగం కొంతకాలం మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం బఫెట్ సొంత కుటుంబ ఫౌండేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. ఆయన పిల్లల పర్యవేక్షణలో నడిచే ఛారిటీ ఫండ్స్, సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్లకు యథావిధిగా వార్షిక సాయం అందుతుందని స్పష్టమైంది.
ప్రస్తుతం ఏళ్ల బిల్ గేట్స్‌పై ఎలాంటి చట్టపరమైన నేరారోపణలు నమోదు కాలేదు. జెఫ్రీ ఎప్స్టీన్ను కలవడం తాను చేసిన అతిపెద్ద తప్పు అని, అందుకు ఎంతగానో పశ్చాత్తాపపడుతున్నానని గతంలోనే గేట్స్ మీడియాకు తెలిపారు. అయితే ఎప్స్టీన్ సాగించిన నేరాల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. వారి మధ్య కేవలం సేవా కార్యక్రమాల గురించిన చర్చలు మాత్రమే జరిగాయని, ఎప్స్టీన్ బాధితులతో తాను ఎప్పుడూ సమయం గడపలేదని బిల్ గేట్స్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!