NTV Telugu Site icon

Nandyala: 18 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేసిన కన్నతల్లి

Baby

Baby

Nandyala: నవ మాసాలు కడుపులో మోసి.. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి.. ఆ పసికందు పాలిట మృత్యువైంది. భర్త మీద కోపంతో కన్నబిడ్డను కడుపున పెట్టుకుంది. పుట్టి నెల రోజులు గడవక ముందే తన చేతులారా చంపేసింది ఓ కసాయి తల్లి. భర్త మీద కోపం ఉంటే.. అతనిపై తీర్చుకోవాలి కానీ, పసికందు ఏమీ చేసిదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ని ఇంటికి సాగనంపడం కాయం

నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల పసివాడిని గొంతు కొరికి, చిన్న కత్తితో పొడిచి చంపేసింది కన్నతల్లి. షానుబి, మహేష్ కు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన షానుబి.. వారం రోజుల తర్వాత ఆ శిశువు అనారోగ్యంతో మృతి చెందింది. రెండవ కాన్పులో షానుబి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Read Also: CM Jagan: అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర.. అత్యంత ముఖ్యమైన కార్యక్రమమన్న జగన్‌

అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తున్నాయి. దీంతో భర్త మహేష్ పై కోపంతో పసికందును గొంతు కొరికి చంపేసింది. దీంతో పసివాడి గొంతు పై తీవ్ర గాయం కావడంతో.. పసివాడి అరుపులకు స్థానికులు వచ్చి చూడగా.. షానుబి మొహంపై రక్తం ఉంది. వెంటనే శిశువును చూసేసరికి గొంతు దగ్గర రక్తం వస్తుంది. ఎందుకిలా చేశావని అడిగితే.. తన భర్తపై కోపంతో పసివాడిని ఈ దారుణానికి పాల్పడినట్లు షానుబి చెప్పిందని బంధువులు తెలిపారు.