NTV Telugu Site icon

Mother Kills Children: నలుగురు పిల్లలను ట్యాంక్‌లో పడేసి చంపిన తల్లి.. ఆపై!

Crime

Crime

Mother Kills Children: రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నలుగురు పిల్లలను తానే వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అనంతరం ఆమె కూడా ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఆదివారం బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబ కలహాలతో మహిళ మనస్తాపానికి గురైందని, జిల్లాలోని సదర్ ప్రాంతంలోని ధనే కా తాలా గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Read Also: Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది మృతి!

ఓ మహిళ వాటర్ ట్యాంక్‌లో నలుగురు పిల్లలను పడేయడంతో వారు మరణించారని బార్మర్ పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మీనా తెలిపారు. ఆ మహిళ రక్షించబడిందని, ప్రస్తుతం చికిత్స పొందుతోందని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెను విచారించనున్నట్లు బార్మర్ ఎస్పీ తెలిపారు. పిల్లలు ఐదు నుండి 11 సంవత్సరాల వయస్సులో ఉన్నారు.

Show comments