Site icon NTV Telugu

Allahabad High Court: అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? క్లారిటీ ఇచ్చిన హైకోర్టు!

Allahabad High Court

Allahabad High Court

అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్‌ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.

READ MORE: Rahul Gandhi: అమెరికాకు రాహుల్‌గాంధీ.. 2 రోజుల పాటు పర్యటన

ఈ ప్రశ్నపై హైకోర్టు స్పందించింది. అత్త తన కోడలిపై గృహ హింస చట్టం, 2005 కింద ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. కోడలు, ఆమె కుటుంబంపై లక్నోలోని దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను సమర్థిస్తూ జస్టిస్ అలోక్ మాథుర్ ఈ తీర్పును వెలువరించారు. చట్టంలోని సెక్షన్ 12ని పరిశీలించిన తర్వాత.. ఉమ్మడి కుటుంబంలో గృహ సంబంధంలో బాధిత స్త్రీ ఎవరైనా ఈ నిబంధన కింద ఫిర్యాదు చేయవచ్చని కోర్టు తెలిపింది. అత్త కోడలిపై గృహ హింస కేసు పెట్టలేరనే వాదనను కోర్టు తోసిపుచ్చింది.

” కోడలు లేదా కుటుంబంలోని మరే ఇతర సభ్యులైన అత్తగారిని వేధిస్తే లేదా శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆ అత్త బాధితురాలిగా మారుతుంది. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. బాధితురాలికి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది” అని కోర్టు పేర్కొంది.

READ MORE: Supreme Court: “వారం రోజుల్లో సమాధానం చెప్పాలి” వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు

విషయం ఏంటి ?
“నా కొడుకును నా కోడలు ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడే నివసించాలని పట్టుబడుతోంది. దీనికి అడ్డు చెప్పినందుకు నాపై, నా భర్తపై అసభ్యంగా ప్రవర్తించింది. తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. అదే సమయంలో.. నా కోడలు వరకట్న వేధింపులు, గృహ హింస కేసును పెట్టింది. అందుకు ప్రతిస్పందనగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఫిర్యాదు చేశాను.” అని అత్త గరిమా పేర్కొంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు జారీ కోడలు, ఆమె కుటుంబీకులపై సమన్లు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా కోడలు, కుటుంబీకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అలహాబాద్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు ​​చెల్లుబాటు అవుతాయని కోర్టు తెలిపింది.

Exit mobile version