పండంటి పసికందును మద్యం మత్తులో దూరంగా నెట్టివెసింది ఓ కసాయి తల్లి.. చలిలో వణికిపోతున్న పట్టించుకోకుండా మత్తులో ఆమె తులుతుండగా.. విషయం గమనించిన పోలీసులు వెంటనే స్పందించడంతో పసి పాప ప్రాణలు కాపాడటంతో పాటు.. పాపను ఆడించి చైల్డ్ హోమ్ ప్రతినిధులకు అందజేశారు. సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ వద్ద యచకురాలిగా ఉంటు వచ్చిన డబ్బుతో పిల్లలను పోసిస్తుంది ఈ తల్లి.. అయితే మద్యానికి అలవాటు పడిన మహిళ… వచ్చిన డబ్బుతో మద్యం సేవించి.. ఆ మత్తులో 20 రోజుల పసిపాపతో పాటు 4 సంవత్సరాల బాలుడిని దగ్గరకు రాకుండా దూరంగా నెట్టి వేయడంతో పాటు వారిని గాయపరిచేలా ప్రవర్తించింది..
Also Read : DK Aruna : రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన చేస్తున్న మీకు మోడీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు
అదే సమయంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ అనిల్ కుమార్‌తో పాటు హోమ్ గార్డు వెంకట్ నాయక్ లు పిల్లలను దగ్గరకు తీసుకోని.. 108 ద్వారా వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.. మత్తులో ఉన్న తల్లి ఎంతకు తెరుకోకపోవడంతో ఇక వైద్యం అందించి.. పిల్లలను అసలే పట్టించుకోకుండా ఉండడంతో.. వెంటనే వారిని చైల్డ్ హోమ్ ప్రతినిధులకు అప్పజెప్పారు.. రాత్రి నుంచి పిల్లలు ఎడుస్తూ ఉండడంతో పోలీస్టేషన్ సిబ్బంది వారిని లాలించి.. తల్లి దగ్గర లేని లోటు తెలియకుండా అన్ని సమకూర్చారు.
Also Read : Shalini Pandey: సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న అర్జున్ రెడ్డి భామ
