ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ దైవంతో సమానం. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురునిలిచి కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆ తల్లి విలవిల్లాడిపోతది. కానీ, ఓ తల్లి మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి కన్న కొడుకుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కన్న కొడుకుపై రాయితో దాడి చేసిన కసాయి తల్లి వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read:Srushti Test Tube Baby Centre: సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్
తల్లి చేసిన దాడిలో పదో తరగతి చదువుతున్న రాజు(15) తలకి తీవ్ర గాయం అయ్యింది. మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగొచ్చే సరికి కొడుకు తలకు గాయమవ్వడంతో షాక్ కు గురయ్యాడు. తల్లి తనపై దాడి చేసిందని తెలపగా ఆశ్చర్యపోయాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించాడు. గతంలోనూ పలుమార్లు తండ్రి, కొడుకులపై దాడి చేయడంతో తల్లిపై పోలీస్ స్టేషన్ లో బాలుడు ఫిర్యాదు చేశాడని సమాచారం. అకారణంగా తల్లి తరచూ చిత్రహింసలు పెడుతూ కొడుతుందంటూ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రాజు.