Site icon NTV Telugu

Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి

Rajasthan Suside

Rajasthan Suside

రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత, తన ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సమీపంలోని ఓ చెరువులో మునిగి సూసైడ్ కు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. తన కూతురు భర్త రోజు కొట్టి చిత్రహింసలకు గురిచేసే వాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read Also: Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..

కూతుళ్లతో కలిసి మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక ఇంటి సమస్యలేనని తెలుస్తోంది. కాగా.. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు ముందు లీల తన కుటుంబానికి అర్ధరాత్రి ఫోన్ చేసి ఇంట్లో గొడవ గురించి చెప్పిందని మృతురాలి పెద్ద నాన్న సుర్జారామ్ తెలిపారు. అయితే.. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సమేతంగా ఉదయం చార్దా వెళ్లామని.. వెళ్లే సరికి గ్రామ చెరువులో లీల, ఆమె ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు కనిపించాయని తెలిపాడు. లీలను తన భర్త కొట్టేవాడని.. ఈ కేసులో న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు.

Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1

Exit mobile version