రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్‌సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. చెరువులో మునిగి ఒక వివాహిత.. ఆమె ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. లీలా భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.