ATP DOUBLE MURDER: అనంతపురం జిల్లాలో ఘోరం.. తల్లీ కొడుకులను ఎవరూ ఊహించని రీతిలో..
- అనంతపురం జిల్లాలో సంచలన ఘటన
- తల్లీ కొడుకులను ఎవరూ ఊహించని రీతిలో
- తల్లికి తల మొండెం వేరయ్యేలా అత్యంత దారుణంగా నరికి వేయగా
- కుమారుడు తల నుజ్జు నుజ్జు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనషుల మధ్య బంధాలు, బంధుత్వాలన్నవి మసకబారిపోతున్నాయి. ఒక్కసారి మనుసులో ద్వేషం పెరిగినా.. లేదా డబ్బు విషయంలో తేడాలు వచ్చినా.. ఎంత దూరమైనా వెళ్తున్నారు. సరిగ్గా ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే.. ఆ గ్రామంలో జరిగిన జంట హత్యలే. అది కూడా తల్లి కొడుకులను ఎవరూ ఊహించని రీతిలో చంపారు. తల్లికి తల మొండెం వేరయ్యేలా అత్యంత దారుణంగా నరికి వేయగా.. కుమారుడు తల నుజ్జు నుజ్జు చేశారు. అసలు ఇంత దారుణంగా వీరిని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది. ఈ హత్యలు చేసిందెవరు? అనంతపురం జిల్లాలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
Also Read:India Cancer Cases: 2045 నాటికి, దేశంలో ఏటా 2.45 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు..!
Also Read
- CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామం.. అంతా తెల్లవారి కోడి కూతతో నిద్ర లేస్తున్నారు.. ఒక కాలనీలో జరిగిన సంఘటన చూసి అంతా భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. గ్రామంలో ప్రతి రోజు ఉదయమే అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసే అంగన్వాడీ టీచర్ యల్లమ్మ ఆమె కుమారుడు చిన్నాని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. సంఘటనా స్థలంలో యల్లమ్మ తల, మొండెం వేరుగా పడి ఉంది. చిన్నా ముఖం నుజ్జు నుజ్జుగా మారింది. అసలు ఇంత దారుణంగా వీరిద్దర్ని హత్య చేసిందెవరంటూ అంతా విస్మయానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరుగులు తీస్తూ గ్రామానికి వచ్చారు. సంఘటనా స్థలం చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. ఎవరు చేసి ఉంటారని చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా.. తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు….
జిల్లా ఎస్పీ.. శింగనమల సీఐ, ఎస్సైతో కలసి స్వయంగా పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలు, రక్తపు మరకలు, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే… గ్రామస్తులతో మాట్లాడి ఘటనకు దారి తీసిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గత కొంతకాలంగా వారికి ఆస్తి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించి, అత్యంత త్వరితగతిన అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్యలు జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. తరిమెల గ్రామంలో సరోజమ్మ కాలనీలో నివాసం ఉంటున్న దండోర నల్లప్పకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు లక్ష్మీదేవి, చిన్న భార్య పేరు యల్లమ్మ. పెద్ద భార్యకు జగజీవన్ అలియాస్ మోహన్‌తో పాటు ఓంకార్ అనే కొడుకులు ఉన్నారు. వీరికి సుమారు పాతిక సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక చిన్న భార్య అంటే ప్రస్తుతం హత్యకు గురైన యల్లమ్మకు కూడా ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చిన్న కుమారుడు చిన్నాతో ఆమె కలిసి ఉంటోంది. నల్లప్ప కూడా కొన్ని రోజుల క్రితం మరణించారు. వాస్తవంగా పిల్లలకు ఊహా తెలిసే వయసుకే నల్లప్ప రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ భార్యల మధ్య సఖ్యత లేకపోవడంతో వారి పిల్లల్లో కూడా ద్వేషభావం పెరుగుతూ వచ్చింది. నల్లప్ప మరణం తర్వాత ఇద్దరు భార్యలు, పిల్లల మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇటీవల ఆస్తి వివాదాలు తోడయ్యాయి…
10 ఎకరాల పొలం విషయంలో వీరి మధ్య విభేదాలు
వాయిస్: నల్లప్పకు ఉన్న 10 ఎకరాల పొలం విషయంలో వీరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యల్లమ్మ ఆమె కుమారుడు చిన్నా ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్ద భార్య కుమారులు మోహన్, ఓంకార్ ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. సుమారు 12గంటల సమయంలో నిద్రిస్తున్న తమ పిన్ని యల్లమ్మను అత్యంత దారుణంగా గొంతుపై నరికారు. ఆమె చనిపోయిన తర్వాత తల మొండం వేరు చేశారు. ఉలికిపాటుతో లేచిన చిన్నా ముఖంపై బండారాయితో మోది అత్యంత దారుణంగా కొట్టారు. దీంతో అతను అక్కడే ప్రాణాలు వదిలాడు…
Also Read:Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
యల్లమ్మ, ఆమె కుమారుడు హత్యకు గురైనా బంధువులు కానీ ఇతర కుటుంబసభ్యులు అటు వైపు రాలేదు. గ్రామస్థులు కూడా కనీసం చూసే పరిస్థితి లేదు. అసలు ఇంత దారుణంగా వారిని హతమార్చారంటే కేవలం ఆస్తి తగాదాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ద్వేషం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పోలీసులు కూడా నిందితులుద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు…
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!