NTV Telugu Site icon

Masood Azhar Died: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్‌ అజార్‌ మృతి..!

Masood Ajahar

Masood Ajahar

వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్‌ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

Read Also: Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ప్రజలు కొంచెం ఓపిక పట్టండి.. అందరికి ఆరు గ్యారెంటీలు అందిస్తాం..

మసూద్‌ అజార్‌ ను విడుదల చేయించడం కోసం1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ జరిగింది. అంతేకాకుండా.. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూదర్ అజార్ కారణం. జూలై 5, 2005న అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంపై దాడితో సహా భారత్‌పై క్రూరమైన ఉగ్రవాద దాడులకు జైషే మహ్మద్ క్యాడర్‌ను అజహర్ ఉపయోగించుకున్నాడు. జనవరి 3, 2016న ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్ఖ్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా అతను దర్శకత్వం వహించాడు. అతను అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ల సన్నిహిత సహచరుడు.

Read Also: Journey Movie: ప్రేమలో మళ్ళీ మునిగి తేలండి.. ఆరోజే ‘జర్నీ’ రీ రిలీజ్

పాకిస్తాన్ లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు అజహార్‌.. కశ్మీర్‌ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు. అంతేకాకుండా.. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది అజహార్. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Show comments