Varahi Temple in Hyderabad: వారాహి దేవి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రేపటితో అమ్మవారి నవరాత్రులు ముగియనున్నాయి.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టడడమే కాదు.. యాత్ర ప్రారంభించే ముందు వారాహి దేవి నవరాత్రులు చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరోసారి అమ్మవారి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.. దీంతో.. ఇప్పుడు వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయి అనే వెతికే పనిలో పడిపోయారు భక్తులు.. అమ్మవారి ఆలయం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. హైదరాబాద్‌లోనే వారాహి అమ్మవారి ఆలయం ఉంది.. కొత్తపేటలోని ఆలయంలో అమ్మవారు కొలువుదీరారు..
Read Also: IND vs ZIM: రాణించిన సికిందర్ రజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ఇక, వారాహి దేవి నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. శత్రువు బాధ నుంచి మీరు తొలగిపోతారు. అమ్మవారు నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో మంచి శుభాలు కలుగుతాయి. అంతేకాదు.. అమ్మవారిని దర్శించుకుంటే.. ఏ సమస్య అయినా తొలగిపోతుందనేది భక్తుల విశ్వాసం.. వారాహి దేవి తొమ్మిది రోజులు పూజకు అందుకుంటున్న వేళ.. అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.. ఆదివారంతో.. అంటే రేపటితో వారాహి దేవి నవరాత్రులు ముగియనున్న విషయం విదితమే.. కాగా, హైదరాబాద్‌లో కొలువుదీరిన వారాహి దేవి ఆలయం ప్రత్యేక ఏంటి..? ఏ సమయంలో దర్శించుకోవాలి? లాంటి మరిన్ని విశేషాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..