Gujarat Elections: గుజరాత్ ఎన్నికలు.. 20 శాతం అభ్యర్థులు నేరచరితులే.. ఆప్‌దే అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య 238గా ఉండగా.. ఈ సారి పెరిగింది. రెండు దశల అభ్యర్థుల సర్వే అనంతరం ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం కాంగ్రెస్‌కు చెందిన 60 మంది అభ్యర్థులు, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన 32 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో నేటితో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగియనుంది.
మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఇందులో 96 మంది కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌కి చెందినవారు, పోటీలో ఉన్న మొత్తం 1,621 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను విశ్లేషించిన ఏడీఆర్ సర్వే అనంతరం ఈ మేరకు తెలిపింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వారి పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్న 330 మంది అభ్యర్థుల్లో మొదటి దశలో 167 మంది 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. రెండో దశలో 788 మంది అభ్యర్థులలో 163 మంది 93 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
తీవ్రమైన నేరాలకు పాల్పడిన అభ్యర్థుల విషయానికొస్తే, ఆప్ 43 మందితో అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్ 28, బీజేపీ 25 మందితో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ నుంచి వరుసగా 181, 179, 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తీవ్రమైన నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా నిర్వచిస్తున్నట్లు ఏడీఆర్ తెలిపింది. 18 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు పాల్పడగా, ఒక అభ్యర్థిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఐదుగురి పేర్లపై హత్య ఆరోపణలు ఉన్నాయి. 20 మంది హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
China: జీ జిన్‌పింగ్ దిగిపో.. కొవిడ్ ఆంక్షలపై చైనీయుల ఆందోళనలు
అహ్మదాబాద్ జిల్లాలోని దస్క్రోయ్ స్థానం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తున్న కిరణ్ పటేల్‌పై హత్య కేసు నమోదైంది. పటాన్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పంచమహల్ జిల్లాలోని షెహ్రా స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీకి చెందిన జెథా భర్వాద్ అత్యాచారం, అపహరణ, దోపిడీ, మహిళ పట్ల అణకువగా వ్యవహరించడం మొదలైన అభియోగాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక సమయంలో రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపలేదని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
ఫిబ్రవరి 13, 2020న సుప్రీంకోర్టు, అటువంటి ఎంపికకు గల కారణాలను తెలియజేయాలని.. నేరారోపణలు లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయకూడదని రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ తప్పనిసరి మార్గదర్శకాల ప్రకారం అటువంటి ఎంపికకు గల కారణాలు సంబంధిత అభ్యర్థి అర్హతలు, విజయాలు, మెరిట్‌ను సూచిస్తాయి.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!