Site icon NTV Telugu

Weather Updates : రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన..

Rain

Rain

Weather Updates : తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు, వడగండ్ల వాన కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.

Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అదే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ (IMD) జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతో పోల్చితే వర్షపాతం 108 శాతానికి చేరుకోనుందని తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకి, జూన్ 11న తెలంగాణను చేరుకుంటాయి. జూలై 8 నాటికి దేశాన్ని మొత్తం కవర్ చేస్తాయి. అయితే ఈసారి రుతుపవనాల ప్రవేశం కొంత ముందుగానే జరిగిందని అధికారులు తెలిపారు.

Pahalgam: మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ.. కారణమిదే!

Exit mobile version