Site icon NTV Telugu

Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి

Monkey

Monkey

ఆకలికి రుచి తెలియదు.. నిద్రకు సుఖమెరుగదు అంటే ఇదేనేమే.. ఇప్పుడు ఈ సామేత ఎందుకు వచ్చిందా అని మీరు ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో నెట్టింట జంతువులు, పక్షుల వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొన్నిసార్లు ఈ వీడియోలు ప్రజలను చాలా నవ్విస్తాయి.. మరి కొన్నిసార్లు భావోద్వేగానికి గురిచేస్తాయి.

Read Also: Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టంట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ కోతి రాళ్ల మధ్య హాయిగా నిద్రిస్తున్నట్లు మనం చూడవచ్చు. వీడియో మొదటి నుండి, కోతి నోరు తెరిచి నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో దాని చుట్టూ అనేక ఇతర కోతులు కూడా కూర్చుని కనిపిస్తున్నాయి. కొన్ని కోతులు తమ పనుల్లో బిజీగా ఉంటే.. మరి కొన్ని ఆడుకుంటున్నారు. వీటన్నింటికీ మించి ఈ కోతి అన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోతు కనిపిస్తుంది.

Read Also: TDP-Janasena: మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా.. నేడు టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ( X)లో బుటెంగిబిడెన్ అనే అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 1.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో 16 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు 250 మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version