NTV Telugu Site icon

Monke Surgery: తొలిసారి కోతికి కంటిశుక్లం శస్త్రచికిత్స.. ఏమైందంటే..!

Monkey

Monkey

హర్యానా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తొలిసారి కోతికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేసి విజయవంతం అయ్యారు. ప్రస్తుతం కోతి తిరిగి చూపు పొందుకోగలిగింది. హిసార్‌లోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వారు ఈ సర్జరీ నిర్వహించారు. ఎల్‌యూవీఏఎస్ ప్రకారం కోతికి మొట్టమొదటిసారిగా కంటిశుక్లం శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: Kadapa: కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు.. జిల్లా నుంచి రౌడీషీటర్లు బహిష్కరణ..!

ఓ కోతి విద్యుత్ షాక్‌తో కంటిచూపు కోల్పోయింది. అలాగే కాళ్లు కూడా కాలిపోయాయి. అనంతరం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన కోతికి ప్రభుత్వ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్యులు కంటిశుక్లం శస్త్రచికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ కావడంతో మంకీ కంటిచూపు పొందుకోగలిగింది.

ఇది కూడా చదవండి: Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు

ఎల్‌యూవీఏఎస్‌లోని యానిమల్ సర్జరీ మరియు రేడియాలజీ విభాగాధిపతి ఆర్‌ఎన్ చౌదరి మాట్లాడుతూ… విద్యుత్ షాక్ కారణంగా కాలిన గాయాలతో గాయపడ్డ కోతిని హన్సి నివాసి అయిన జంతు ప్రేమికుడు మునీష్… మెడికల్ క్యాంపస్‌కు తీసుకువచ్చారని తెలిపారు. మొదట్లో నడవలేని పరిస్థితి ఉందని.. చాలా రోజుల సంరక్షణ, చికిత్స తర్వాత కోతి నడవడం ప్రారంభించిందని చెప్పారు. కోతికి కంటిచూపు కనిపించడం లేదని వైద్యులు గుర్తించారని.. అనంతరం కంటిచూపు వచ్చేలా సర్జరీ చేసినట్లు RN చౌదరి అధికారిక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ప్రియాంక దుగ్గల్.. యూనివర్శిటీలోని యానిమల్ ఐ యూనిట్‌లో తొలుత కోతిని పరీక్షించారు. ఒక కంటిలోని విట్రస్ కూడా దెబ్బతినడంతో మరో కంటికి ఆపరేషన్ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కోతి పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Remal Cyclone : అస్సాంలో ‘రెమాల్’ తుఫాను..ఐదుగురు మృతి.. 42 వేల మందిపై ప్రభావం