NTV Telugu Site icon

Drones: డ్రోన్ల ద్వారా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ.. కేంద్రం కీలక నిర్ణయం

Mngra

Mngra

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్‌ల సహాయంతో వర్క్‌సైట్‌లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(SOP) గైడ్ లైన్ లో ఈ విషయాలను ప్రస్తావించారు. డ్రోన్లతో ఉపాధి పనులు జరుగుతున్నప్పుడు.. లైవ్ సర్వే, పూర్తయిన పనుల తనిఖీ, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, ఫిర్యాదులు వచ్చిన తర్వాత పనుల ప్రత్యేక తనిఖీ వంటివి తెలుసుకోనున్నారు.

Read Also: Commando Suicide: ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య.. కారణమేంటంటే?

MNREGAలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం అందుతున్నాయని గ్రామీణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కూలీల స్థానంలో యంత్రాల వినియోగం, ఏ పని చేయకుండానే కొంత మంది జీతాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలను సేకరించడంలో డ్రోన్లు సహాయపడతాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి తమ వాటాగా సమకూర్చే ఫండ్స్ నుంచి డ్రోన్లను కొనాలని కేంద్ర సర్కారు నిర్దేశించింది.

Read Also: Chandrababu: వైసీపీవి దొంగ సర్వేలు.. వారికి 14 శాతం ఓట్లు కూడా రావు..!

మరోవైపు డ్రోన్లను కొనలేని పరిస్థితుల్లో.. వాటిని లీజుకు లేదా అద్దెకు ఇచ్చే సంస్థల సేవలను వినియోగించుకోవాలని గ్రామీణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ డ్రోన్లు తీసే వీడియోలు, ఫోటోలను స్టోర్ చేయడానికి, డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఉపాధి హామీ కూలీల పనులను పర్యవేక్షిండానికి డోన్లతో చేస్తున్న ప్రయత్నం రెండోది కాగా.. గతంలో కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఆధారిత అప్లికేషన్ సహాయంతో కూలీల హాజరును తప్పనిసరి చేసింది.