NTV Telugu Site icon

Andhra Pradesh: రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ..

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్టపోయిన వ‌ర‌ద బాధితుల్లో 21,768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్రస్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి మొత్తం రూ.18,69,89,000ల సొమ్ము జ‌మ చేయ‌నున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వ‌ర‌దల్లో న‌ష్టపోయిన బాధిత ప్ర‌తి కుటుంబానికి ప్రభుత్వం త‌ప్పనిస‌రిగా సాయం అందించాల‌ని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చార‌ని, ఆ ప్రకారం ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంద‌ని చెప్పారు. బాధితులెవ్వరూ అందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని వెల్లడించారు.

Read Also: Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య