మెగాస్టార్ చిరుప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చివరి షెడ్యూల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరొక యంగ్ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. మెగాస్టార్ బర్త్ డే నాడు అఫీషియల్ గా ప్రకటించారు.
Also Read : Tollywood : తన సినిమాలకు తానే టైటిల్స్ పెడుతున్న స్టార్ హీరో
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబరు 5న పూజ కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీని సెలెక్ట్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహన్ ఇప్పుడు చిరుతో జోడిగా చేయబోతుందట. తంగలాన్ లో సీనియర్ హీరో విక్రమ్, హృదయపూర్వంలో మలయాళ స్టార్ మోహన లాల్ వంటి సీనియర్స్ తో నటించి మెప్పించిన మాళవిక ఇప్పుడు చిరుతో జోడి కట్టేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మిరాయ్ చిత్ర డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి నుండి మొదలు పెట్టబోతున్నాడు దర్శకుడు బాబీ.