NTV Telugu Site icon

Champions Trophy: ‘భారత్ పాకిస్థాన్‌ రాకపోతే..’ బీసీసీఐని హెచ్చరించిన పాక్ మాజీ కెప్టెన్

Ind Vs Pak

Ind Vs Pak

ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.

Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐని ఒప్పించాలని మాజీ భారత ఆటగాళ్లకు మొయిన్ ఖాన్ సలహా ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ క్రికెటర్లు రాజకీయాలను క్రికెట్‌కు దూరంగా ఉంచాలని.. బీసీసీఐకి చెప్పాలని సూచించారు. రాజకీయ అంశాలతో క్రికెట్‌కు అంతరాయం కలగకూడదు.. భారత్‌, పాక్‌ల ఆటలను చూడటానికి అభిమానులు ఎంతో ఇష్టపడతారని అన్నాడు. మరోవైపు.. ఖాన్ ఐసీసీ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. “భారత్ తన ప్రత్యర్థులను గౌరవించేలా ఐసీసీతో కలిసి పనిచేయాలి. ఒకవేళ వారు పాకిస్థాన్ రాకపోతే, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనే నిర్ణయం గురించి పాకిస్తాన్ ఆలోచించాల్సి ఉంటుంది” అని తెలిపారు.

Bangladesh: 15 రోజుల్లో బంగ్లాదేశ్ హిందువులపై 1000కి పైగా దాడులు..

పాకిస్థాన్ 2008లో మొత్తం ఆసియా కప్‌, గత ఏడాది అదే టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 1996 తర్వాత పాకిస్థాన్ ఒక ప్రధాన ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఐసీసీ టోర్నీ కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపుతుందా లేదా అనే విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది. 2012-13 సీజన్‌ నుంచి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఐసిసి టోర్నీలో భారత్‌తో తలపింది. 2008 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

Show comments