Site icon NTV Telugu

Mohsin Naqvi: “మేము భారత్‌తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..

Mohsin Naqvi Trolls

Mohsin Naqvi Trolls

Mohsin Naqvi: ఇటీవల జరిగిన భారత-పాకిస్థాన్ మ్యాచ్ ఏ మేరకు హాట్‌ టాపిక్‌గా మారిందో తెలిసిన విషయమే. పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ముందు ఒప్పుకోలేదు. అనేక మీటింగ్స్ తరువాత ఎట్టకేలకు దిగి వచ్చి మ్యాచ్ ఆడింది. అంతే కాదు.. ఎంతో బిల్డప్ కొట్టిన పాకిస్థాన్ చివరకు భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఈ అంశంపై తాజాగా పీబీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ యూటర్న్ వెనుక అసలు కారణం అనుర కుమార దిసానాయకే (Anura Kumara Dissanayake ) అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 9న పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతినిధులు కలిసి దీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చలతో పాటు శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా జోక్యం చేసుకుని పాకిస్థాన్ ప్రధానికి ఫోన్ చేసి మ్యాచ్ ఆడేలా అనుమతించాలని కోరారు. ఆ ఫోన్ కాల్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నఖ్వీ తెలిపారు. ప్రధాని షరీఫ్ వెంటనే తనను సంప్రదించి “ఇక ఎలాంటి సమస్య లేదు, మ్యాచ్ ఆడాలి” అని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు.

READ MORE: Harish Rao: దళిత నాయకుడు బాల్క సుమన్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..

మ్యాచ్ అనంతరం నఖ్వీ, శ్రీలంక అధ్యక్షుడిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “నిన్నటి మ్యాచ్‌లో నిజమైన హీరో మీరు. రెండు బిలియన్ మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అది మీ వల్లే సాధ్యమైంది” అని అన్నారు. అంతా సవ్యంగా జరిగి మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ, పాకిస్థాన్‌కు ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం (R. Premadasa Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ బలమైన ప్రదర్శన చేసింది. ఇషాన్ కిషన్ అద్భుతంగా 77 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. కఠినమైన పిచ్‌పై భారత్ మొత్తం 175 పరుగులు చేసింది. తర్వాత బౌలింగ్‌లోనూ భారత జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా ఔటవుతూ మ్యాచ్‌ను చేతులారా కోల్పోయారు. ఈ ఓటమి కారణంగా పాకిస్థాన్‌కు తర్వాతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

READ MORE: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!

Exit mobile version