ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన ఈ సిరీస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రాణం పోశారు. సగటు ప్రేక్షకుడికి ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథనంతో ‘దృశ్యం 1’ మరియు ‘దృశ్యం 2’ అద్భుతమైన విజయాలుగా నిలిచాయి. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను సృష్టించింది.
Also Read : Devara 2 : ‘దేవర: పార్ట్ 2’ ప్రాజెక్ట్ నిలిపివేత? ఫ్యాన్స్‌లో టెన్షన్.. పూర్తి వివరాలు ఇవే!
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో మూడవ భాగం అయిన ‘దృశ్యం 3’ షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తయినట్లు తెలుస్తోంది. ‘జార్జ్ కుట్టి’ పాత్రకు ముగింపు పలకనున్న ఈ పార్ట్ 3 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ‘దృశ్యం 3’ పూర్తి చేసిన వెంటనే మోహన్ లాల్ తన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్ లో జయిన్ అయ్యారట. ఆ సినిమానే ‘జైలర్ 2’. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో మోహన్ లాల్ నటించబోతున్నారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి ఇతర స్టార్ హీరోల ఎంట్రీ ఆ చిత్రానికి మరింత హైప్ ఇచ్చింది. మొత్తానికి ‘దృశ్యం 3’లో తన భాగం పూర్తి చేసుకున్న మోహన్ లాల్, ‘జైలర్ 2’ లోని తన పాత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి సెట్స్‌పైకి ఎంటర్ అయ్యారు.
