Mohanlal : మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్-2 ఎంపురాన్ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సీన్లపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివాదం పెద్దది అవుతుండటంతో తాజాగా మోహన్ లాల్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ సినిమాలో కొన్ని సీన్ల వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయని.. అది కావాలని చేసింది కాదన్నారు. ఎవరినైనా నొప్పించి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలంటూ కోరారు.
Read Also : Prabhas : ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్ డేట్ ఇచ్చిన సందీప్ వంగా..
‘నేను ఏ రాజకీయాలను, ఏ మతాన్ని ఉద్దేశించి ఆ సీన్లు తీయలేదు. నేను మీలో ఒకడిని. నాకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదు. 40 ఏళ్లుగా మీతో అనుబంధం ఉంది. అనుకోకుండా ఆ సీన్లు మా సినిమాలో భాగం అయ్యాయి. వాటిని మేం తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. ఎల్-2 సినిమాలో 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఓ సీన్ తీశారు. ఈ అల్లర్లలో ఓ వర్గానికి చెందిన కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపేసి రాజకీయాల్లోకి వస్తాడు. ఈ సీన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అందుకే దాన్ని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా క్షమాపణలు చెప్పారు.