Site icon NTV Telugu

Madhya Pradesh CM: మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌

Cm Madyapradesh

Cm Madyapradesh

మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌ ఖరారయ్యారు. బీజేపీ అధిష్టానం మోహన్‌ యాదవ్‌ను సీఎంగా ప్రకటించింది. మోహన్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమ్ నారాయణ్ యాదవ్ పై 12,941 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా నిలిచారు.

Sridhar Babu: ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది..

మరోవైపు.. నరేంద్ర సింగ్ తోమర్‌ను స్పీకర్‌గా నియమించారు. అంతేకాకుండా.. ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ప్రకటించారు. అందులో జగదీష్ దేవరా, రాజేంద్ర శుక్లా డిప్యూటీ సీఎంలుగా నియమితులయ్యారు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ సీఎం పేరును నిర్ణయించడానికి పరిశీలకులు బీజేపీ సీనియర్ నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌, ఆ పార్టీ నేత ఆశలక్రా భోపాల్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సీఎం పేరును ఆమోదించారు.

F-16 Jet Crash: దక్షిణ కొరియాలో కూలిన అమెరికాకు చెందిన యుద్ధ విమానం.. పైలట్కు తీవ్రగాయాలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గాను 163 స్థానాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. దీంతో సీఎం ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, రాకేష్ సింగ్, కైలాష్ విజయవర్గీయ పేర్లు కూడా సీఎం రేసులో చర్చలో ఉన్నాయి. చివరకు హైకమాండ్ మోహన్ యాదవ్ ను సీఎంగా ఖరారు చేసింది.

Exit mobile version