Site icon NTV Telugu

Mohan Babu University Kidnap Case: ఆధారాలు దోరికాయి‌.. మంచు మోహన్ బాబు, విష్ణు లకు నోటీసులు ఇస్తాం!

Mohan Babu

Mohan Babu

Mohan Babu University Kidnap Case: తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?

ఈ ఘటనపై తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో ఫీజుల వసూళ్లపై నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్‌లను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు అందగానే పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. శేషాపురం ప్రాంతంలో కిడ్నాప్‌కు పాల్పడిన 13 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఇనోవా వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ మూడు వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవేనని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో పాటు బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపారు. బౌన్సర్లను కేవలం స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

Egg Veg or Non-Veg: మిలియన్ డాలర్స్ క్వశ్చన్.. “కోడిగుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్”?

ఈ కేసులో A2, A3గా మోహన్ బాబు, విష్ణుల పేర్లు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తామని రవిమనోహరచారి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని, తప్పు చేసినవారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.

Exit mobile version