ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61) విరోచిత పోరాటం వృథా అయింది. బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే భారత్ విజయానికి చేరువగా వచ్చిన సమయంలో సిరాజ్ (4) పదో వికెట్‌గా వెనుదిరగడంతో పరాజయం పాలైంది.
Also Read: APL 2025 Auction: 2025 ఏపీఎల్ వేలం.. నితీష్ రెడ్డి, హనుమ విహారికి ఎంత ధరో తెలుసా?
భారత్ విజయానికి ఇంకా 24 రన్స్ అవసరం అయ్యాయి. మహమ్మద్ సిరాజ్ అప్పటికే క్రీజులో పాతుకుపోవడంతో.. రవీంద్ర జడేజా నమ్మకంతో సింగిల్ తీసి ఇచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌన్స్ అయిన బంతిని.. సిరాజ్ బ్యాక్‌ఫుట్ తీసుకుని డిఫెండ్ చేశాడు. బంతి నెమ్మదిగా సిరాజ్ పక్క నుంచి వెళ్లి.. స్టంప్స్‌ని గిరాటేసింది. ఇంకేముందు బెయిల్ కిందపడిపోయింది. టీమిండియా ఆలౌట్ కాగా.. ఫాన్స్ నిరాశలో ముగినిపోయారు. మరోవైపు ఇంగ్లండ్ ప్లేయర్స్ గంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు. సిరాజ్ వికెట్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సిరాజ్.. ఎంతపని చేశావయ్యా’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Test Cricket.
Wow.
😍 pic.twitter.com/XGDWM1xR2H— England Cricket (@englandcricket) July 14, 2025